ఫ్లిప్కార్ట్లో 10వేల ఉద్యోగాలు | Flipkart To Hire 10,000 Temporary Staff Ahead Of Festive Season | Sakshi
Sakshi News home page

ఫ్లిప్కార్ట్లో 10వేల ఉద్యోగాలు

Sep 12 2016 10:21 AM | Updated on Aug 1 2018 3:40 PM

ఫ్లిప్కార్ట్లో 10వేల ఉద్యోగాలు - Sakshi

ఫ్లిప్కార్ట్లో 10వేల ఉద్యోగాలు

మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ దీపావళి ధమాకా ప్రకటించింది.

న్యూఢిల్లీ : మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ దీపావళి ధమాకా ప్రకటించింది. పండుగ సీజన్ నేపథ్యంలో 10,000 మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ఫ్లిప్కార్ట్  వెల్లడించింది. పండుగ డిమాండ్కు అనుగుణంగా డెలివరీ, లాజిస్టిక్స్ సర్వీసుల్లో ఈ ఉద్యోగులను నియమించుకుంటున్నట్టు పేర్కొంది. చేతిలో సరిపడా ఉద్యోగులు లేక, పండుగ సీజన్ల్లో వస్తువుల డెలివరీని జాప్యం చేయకూడదని భావించిన స్నాప్డీల్ సైతం ఇటీవలే తన సంస్థలో దాదాపు 10వేల తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. పండుగ సీజన్ల్లో అమ్మకాలను పెంచడానికి ఈ-కామర్స్ సంస్థలు భారీ ఆఫర్లతో వినియోగదారులను అలరిస్తుంటాయి. ఈ ఆఫర్ల లాంచింగ్ ప్రిపరేషన్కు ఈ-కామర్స్ దిగ్గజాలు ముందస్తుగా ఉద్యోగ నియామకాలను ప్రకటిస్తున్నాయి. 
 
"పండుగల సీజన్ వచ్చేస్తోంది.. గతంలో కంటే ఈసారి బిగ్ బిలియన్ సేల్స్ మరింత ఎక్కువగా ఉండవచ్చని ఆశాభావంతో పలు మార్గాల్లో తమ డెలివరీ సామర్థ్యాలను పెంచుకుంటున్నాం" అని ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. డెలివరీ మోడల్లో తమ సామర్థ్యాలను పెంచుకోవడానికి అదనంగా 10వేలకు పైగా తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంటున్నట్టు ఫ్లిప్కార్ట్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నితిన్ సేత్ తెలిపారు. 800 ఉద్యోగులను ఫ్లిప్కార్ట్ తొలగిస్తుందనే రిపోర్టులపై సేత్ను ప్రశ్నించగా.. ఆయన నెగిటివ్గా స్పందించారు. ఉద్యోగాలు తొలగించే ఉద్దేశ్యమేమీ లేదని ఘూటుగా సమాధానమిచ్చారు. వ్యాపార లక్ష్యాలను సాధించడానికి కంపెనీకి అవసరమయ్యే స్టాప్ను నియమించుకుంటూనే ఉంటామని పేర్కొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement