నాలుగు నెలల గరిష్టానికి వినియోగ ధరల సూచీ | Consumer Inflation Picks Up To 3.65% In February | Sakshi
Sakshi News home page

నాలుగు నెలల గరిష్టానికి వినియోగ ధరల సూచీ

Mar 14 2017 6:27 PM | Updated on Sep 5 2017 6:04 AM

ఫిబ్రవరి నెలకు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు భారీగా పెరిగింది. దేశం వార్షిక వినియోగదారుల ధర ద్రవ్యోల్బణం 3.65 శాతంగా నమోదైంది.

న్యూఢిల్లీ: ఫిబ్రవరి నెలకు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు భారీగా పెరిగింది. దేశం వార్షిక వినియోగదారుల ధర ద్రవ్యోల్బణం 3.65 శాతంగా నమోదైంది.  2016 అ‍క్టోబర్‌ సెప్టెంబర్‌ స్థాయిని నమోదు  చేసి , నాలుగునెలల గరిష్టానికి చేరింది.  గత నెలలో ఇది 3.17శాతంగా ఉంది.

ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం  ఫిబ్రవరి మాసానికిగాను 2.01 శాతంగా నిలిచి ఐదు సంవత్సరాల కనిష్ఠ స్థాయికి  చేరింది. ఈ గణాంకాలను ప్రభుత్వం మంగళవారం  వెల్లడించింది. గత జనవరిలో ఇది 0.53శాతంగా ఉంది.

రాయిటర్స్ఆర్థికవేత్తలు గత నెల వార్షిక చిల్లర ద్రవ్యోల్బణం జనవరిలో 3.17 శాతం పోలిస్తే, 3.58 శాతంగా ఉండనుందని   భావించారు.

 


 

Advertisement
 
Advertisement
Advertisement