'తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు... అధిష్టానం' | Congress high command made mistake, not congress party: lagadapati rajagopal | Sakshi
Sakshi News home page

'తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు... అధిష్టానం'

Dec 10 2013 9:07 AM | Updated on Mar 18 2019 9:02 PM

'తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు... అధిష్టానం' - Sakshi

'తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు... అధిష్టానం'

రాష్ట్ర విభజన నిర్ణయం విషయంలో తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదని, కాంగ్రెస్ అధిష్టానమని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు.

న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన నిర్ణయం విషయంలో తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదని, కాంగ్రెస్ అధిష్టానమని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు.  యూపీఏపై అవిశ్వాస తీర్మానం పెట్టే అధికారం తమకు ఉందని ఆయన మంగళవారమిక్కడ ఓ టీవీ ఛానల్స్ కార్యాక్రమంలో వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించటంతో.. ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సొంత పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ లోక్‌సభ స్పీకర్‌కు నిన్న  నోటీసు అందించారు. కాంగ్రెస్ ఎంపీలు రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎ.సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్, జి.వి.హర్షకుమార్ సోమవారం ఉదయం ఈమేరకు స్పీకర్ మీరాకుమార్‌కు నోటీసు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement