రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి | Cong state executive member Ram Adhar Pasi dies in mishap | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి

Sep 9 2015 12:46 PM | Updated on Mar 18 2019 7:55 PM

రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత రామ్ ఆధార్ పాసి (60) మృతి చెందాడు.

అమేథి: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తరప్రదేశ్లోని రామ్ ఆధార్ పాసి (60) అనే సీనియర్ నేత మృతి చెందాడు. బైక్పై వెళ్లొస్తున్న ఆయనను ఓ ట్రక్కు ఢీకొనడంతో ఆయన బుధవారం తెల్లవారు జామున ప్రాణాలుకోల్పోయారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యుడు అయిన రామ్ ఆధార్.. మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.

ఆయనకు తీవ్ర గాయాలవడంతో వెంటనే లక్నోలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ తీవ్ర గాయాల కారణంగా తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో మరణించారు.  ఈయన స్వగ్రామం అమేథి నియోజకవర్గంలోని మొరాయి కా పూర్వా. పాసి అనూహ్య మరణంపట్ల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు ఆయన ప్రతినిధి చంద్రకాంత్ దుబే తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement