సరికొత్త ఆలోచనలతోనే అవినీతికి చెక్‌ | Sakshi
Sakshi News home page

సరికొత్త ఆలోచనలతోనే అవినీతికి చెక్‌

Published Wed, Jun 14 2017 8:44 AM

Central Vigilance Commission seeks out of the box ideas to check corruption

న్యూఢిల్లీ : అవినీతి నిర్మూలనకు సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ) అన్ని ప్రభుత్వ విభాగాల్ని కోరింది. అవినీతికి వ్యతిరేకంగా సీవీసీ ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా వారం రోజుల పాటు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్లు(సీవీవో) అందరూ తమ విధానాలతో పాటు వ్యూహాల్ని కమిషన్‌తో పంచుకోనున్నారు.

గతేడాది నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 15 లక్షల మంది ప్రజలతో పాటు 30,000 సంస్థలు అవినీతి నిర్మూలనకు ఈ–ప్రతిజ్ఞ చేశాయని సీవీసీ పేర్కొంది. సెమినార్లు నిర్వహించడంతో పాటు బ్యానర్లు, పోస్టర్ల ద్వారా ప్రభుత్వాధికారులు, ప్రజల్లో అవినీతిపై అవగాహన కలిగిస్తామని కమిషన్‌ తెలిపింది.

Advertisement
Advertisement