బ్లాక్ బెర్రీ ఆఖరి స్మార్ట్ ఫోన్..ధరెంతో తెలుసా? | BlackBerry KEYone, the 'Last Smartphone Designed by BlackBerry', Launched at MWC 2017 for $549 | Sakshi
Sakshi News home page

బ్లాక్ బెర్రీ ఆఖరి స్మార్ట్ ఫోన్..ధరెంతో తెలుసా?

Feb 26 2017 11:24 AM | Updated on Nov 6 2018 5:26 PM

బ్లాక్ బెర్రీ ఆఖరి స్మార్ట్ ఫోన్..ధరెంతో తెలుసా? - Sakshi

బ్లాక్ బెర్రీ ఆఖరి స్మార్ట్ ఫోన్..ధరెంతో తెలుసా?

స్మార్ట్ ఫోన్ కంపెనీల మెగా ఈవెంట్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 ప్రారంభానికి ముందు బ్లాక్ బెర్రీ తన లాస్ట్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది.

స్మార్ట్ ఫోన్ కంపెనీల మెగా ఈవెంట్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 ప్రారంభానికి ముందు బ్లాక్ బెర్రీ తన లాస్ట్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. బ్లాక్ బెర్రీ కీవన్ పేరుతో ఈ కెనడియన్ కంపెనీ దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది.  తన ఇన్-హౌజ్లో రూపొందించిన చివరి స్మార్ట్ ఫోన్ బ్లాక్ బెర్రీకి ఇదే కాబోతుంది. ఇప్పటినుంచి స్మార్ట్ ఫోన్ డిజైన్ను, ఉత్పత్తిని ఈ కంపెనీ పూర్తిగా నిలిపివేయబోతుంది. గత సెప్టెంబర్లోనే ఈ నిర్ణయాన్ని బ్లాక్ బెర్రీ ప్రకటించింది. చివరిగా మార్కెట్లోకి తీసుకొచ్చిన కొత్త బ్లాక్ బెర్రీ కీవన్, పిజికల్ కీబోర్డును కలిగి ఉంది. 2017 ఏప్రిల్ నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి వస్తోంది. ధర 549 డాలర్లు(సుమారు రూ.38,600)గా కంపెనీ నిర్ణయించింది. అయితే యూకేలో ఈ ఫోన్ 499 జీబీపీ(సుమారు రూ.41,400), యూరప్లో 599 యూరోలకు(సుమారు రూ.41,400) అందుబాటులో ఉండనుంది.
 
బ్లాక్ బెర్రీ కీవన్ స్పెషిఫికేషన్లు...
4.5 అంగుళాల ఫుల్-హెచ్డీ ఐపీఎస్ డిస్ ప్లే
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ఆక్టా-కోర్ ఎస్ఓసీ
3జీబీ ర్యామ్ 
12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
32జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
2టీబీ వరకు విస్తరణ మెరీ
3505 ఎంఏహెచ్ బ్యాటరీ
ఆండ్రాయిడ్ 7.1 నోగట్ విత్ బ్లాక్ బెర్రీ బిజినెస్, సెక్యురిటీ ఫీచర్లు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement