అమెజాన్‌ సీఈవో బెజోస్‌ కీలక నిర్ణయం | Bezos is selling $1 billion of Amazon stock a year to fund rocket venture | Sakshi
Sakshi News home page

అమెజాన్‌ సీఈవో బెజోస్‌ కీలక నిర్ణయం

Apr 6 2017 2:14 PM | Updated on Aug 24 2018 4:15 PM

అమెజాన్‌ సీఈవో బెజోస్‌ కీలక నిర్ణయం - Sakshi

అమెజాన్‌ సీఈవో బెజోస్‌ కీలక నిర్ణయం

అంతరిక్షంలోకి టూరిస్టులను షికారు కొట్టించేందుకు ఉరకలు పెడుతున్న అమెజాన్‌ సహ వ్యవస్తాపకుడు జెఫ్‌ బెజోస్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.


అంతరిక్షంలోకి టూరిస్టులను షికారు కొట్టించేందుకు  ఉరకలు పెడుతున్న  అమెజాన్‌  సహ వ్యవస్తాపకుడు జెఫ్‌ బెజోస్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.   తన కలల ప్రాజెక్టు బ్లూ ఆరిజన్‌  రాకెట్‌  కంపెనీ కోసం  అమెజాన్‌ భారీ వాటాలను విక్రయించనున్నారు. సంవత్సరానికి  సుమారు రూ.65వేలకోట్లు (1 బిలియన్‌ డాలర్లు)   విలువైన అమెజాన్‌ షేర్లను విక్రయించనున్నట్టు బుధవారం  బెజోస్‌ ప్రకటించారు.  ఈ నిధులను  బ్లూ ఆరిజన్‌ కోసం వెచ్చించనున్నట్టు  ప్రపంచ కుబేరుల్లో  ఒకడు, వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక అధిపతి కూడా అయిన  బెజోస్‌ తెలిపారు.  

ఈ ప్రాజెక్టు ద్వారా  మనుషుల్ని చంద్రుడిపైకి తీసుకెళ్లే సర్వీసులను అందుబాటులోకి తేనుంది.  భూమికి వంద కిలోమీటర్ల ఎత్తువరకూ తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. 2017 లో 11 నిమిషాల  అంతరిక్ష యాత్రను లక్ష్యంగా పెట్టుకున్నారు.  అయితే  వచ్చే ఏడాది వరకు ఇది సాధ్యంకాకపోవచ్చని  బెజోస్‌  తెలిపారు. కొలరాడో స్ప్రింగ్స్‌ (అమెరికా)లో 33వ స్పేస్‌ సింపోజియం  సందర్భంగా మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.   స్పేస్‌కి చేరడానికి చాలా సమయం పడుతుందనీ, అయినా బ్లూ ఆరిజన్‌ లో పెట్టుబడులు పెట్టడం  సంతోషంగా  ఉందని చెప్పారు.  చివరికి బ్లూ ఆరిజిన్   స్వీయ-సమృద్ది తో లాభదాయంగా ఉండాలనేది తమ లక్ష్యమని, తద్వారా లక్షలాది మంది ప్రజలకు  అతితక్కువ ఖర్చుకే అంతరిక్ష విమాన సౌకర్యాన్ని కల్పించాలనే దీర్ఘకాలిక  లక్ష్యంతో  ఉన్నట్టు బెజోస్ చెప్పారు.

స్పేస్‌ ఎక్స్‌ సంస్థ సిద్ధం చేసిన క్రూడ్రాగన్‌ క్యాప్సూల్‌ తో పోలిస్తే న్యూషెపర్డ్‌  ఇంజనీరింగ్‌ కొంచెం భిన్నంగా ఉంటుందని చెప్పారు.   శాటిలైట్లను, మానవులను ఆర్బిట్‌ లోకి తీసుకెళ్లేందుకు  బ్లూ ఆరిజన్‌ స్పేస్‌ ఎక్స్‌ఫాల్కన్‌ 9,  డ్రాగన్‌ క్యాప్సూల్‌  లాంటి రెండవ అంతరిక్షనౌక ను సిద్ధం చేస్తోంది.  న్యూ గ్లెన్‌ అని  చెబుతున్న దీనికయ్యే ఖర్యును 2.5 బిలియన్‌డాలర్లుగా అంచనా వేస్తున్నారు. మరోవైపు  ఫోర్బ్స్ పత్రిక ప్రకారం, బెజోస్  నికర సంపద 78 బిలియన్‌  డాలర్లు. న్యూషెపర్డ్‌గా పిలిచే అంతరిక్ష నౌకను ఇప్పటికే ఐదుసార్లు విజయవంతంగా పరీక్షించి చూశారు. మొత్తం ఆరుగుర్ని తీసుకెళ్లకలిగే షెపర్డ్  టికెట్ల అమ్మకాలను  బ్లూఆరిజన్‌ ఇకా మొదలు పెట్టలేదు.    

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement