breaking news
Bezos
-
అమెజాన్ సీఈవో బెజోస్ కీలక నిర్ణయం
అంతరిక్షంలోకి టూరిస్టులను షికారు కొట్టించేందుకు ఉరకలు పెడుతున్న అమెజాన్ సహ వ్యవస్తాపకుడు జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కలల ప్రాజెక్టు బ్లూ ఆరిజన్ రాకెట్ కంపెనీ కోసం అమెజాన్ భారీ వాటాలను విక్రయించనున్నారు. సంవత్సరానికి సుమారు రూ.65వేలకోట్లు (1 బిలియన్ డాలర్లు) విలువైన అమెజాన్ షేర్లను విక్రయించనున్నట్టు బుధవారం బెజోస్ ప్రకటించారు. ఈ నిధులను బ్లూ ఆరిజన్ కోసం వెచ్చించనున్నట్టు ప్రపంచ కుబేరుల్లో ఒకడు, వాషింగ్టన్ పోస్ట్ పత్రిక అధిపతి కూడా అయిన బెజోస్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా మనుషుల్ని చంద్రుడిపైకి తీసుకెళ్లే సర్వీసులను అందుబాటులోకి తేనుంది. భూమికి వంద కిలోమీటర్ల ఎత్తువరకూ తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. 2017 లో 11 నిమిషాల అంతరిక్ష యాత్రను లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే వచ్చే ఏడాది వరకు ఇది సాధ్యంకాకపోవచ్చని బెజోస్ తెలిపారు. కొలరాడో స్ప్రింగ్స్ (అమెరికా)లో 33వ స్పేస్ సింపోజియం సందర్భంగా మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్పేస్‌కి చేరడానికి చాలా సమయం పడుతుందనీ, అయినా బ్లూ ఆరిజన్ లో పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని చెప్పారు. చివరికి బ్లూ ఆరిజిన్ స్వీయ-సమృద్ది తో లాభదాయంగా ఉండాలనేది తమ లక్ష్యమని, తద్వారా లక్షలాది మంది ప్రజలకు అతితక్కువ ఖర్చుకే అంతరిక్ష విమాన సౌకర్యాన్ని కల్పించాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో ఉన్నట్టు బెజోస్ చెప్పారు. స్పేస్ ఎక్స్ సంస్థ సిద్ధం చేసిన క్రూడ్రాగన్ క్యాప్సూల్ తో పోలిస్తే న్యూషెపర్డ్ ఇంజనీరింగ్ కొంచెం భిన్నంగా ఉంటుందని చెప్పారు. శాటిలైట్లను, మానవులను ఆర్బిట్ లోకి తీసుకెళ్లేందుకు బ్లూ ఆరిజన్ స్పేస్ ఎక్స్ఫాల్కన్ 9, డ్రాగన్ క్యాప్సూల్ లాంటి రెండవ అంతరిక్షనౌక ను సిద్ధం చేస్తోంది. న్యూ గ్లెన్ అని చెబుతున్న దీనికయ్యే ఖర్యును 2.5 బిలియన్డాలర్లుగా అంచనా వేస్తున్నారు. మరోవైపు ఫోర్బ్స్ పత్రిక ప్రకారం, బెజోస్ నికర సంపద 78 బిలియన్ డాలర్లు. న్యూషెపర్డ్గా పిలిచే అంతరిక్ష నౌకను ఇప్పటికే ఐదుసార్లు విజయవంతంగా పరీక్షించి చూశారు. మొత్తం ఆరుగుర్ని తీసుకెళ్లకలిగే షెపర్డ్ టికెట్ల అమ్మకాలను బ్లూఆరిజన్ ఇకా మొదలు పెట్టలేదు. -
ఐటీ దిగ్గజాల అరుదైన కలయిక
వాషింగ్టన్: ఐటీ పరిశ్రమకు చెందిన దిగ్గజాలు ఒకో చోట కలుసుకోవడమే చాలా అరుదు. అటువంటిది ఇంటెర్నెట్ సామ్రాజ్యంలో మకుటంలేని రారాజులుగా రాణిస్తున్న 29 మంది ఒకచోట కలుసుకోవడమే కాకుండా కలిసి ఫొటో దిగడం మరింత అరుదు. అలాంటి అరుదైన సంఘటనకు వాషింగ్టన్, రెడ్మాండ్లోని మైక్రోసాప్ట్ ప్రధాన క్యాంపస్ వేదికైంది. చైనా, మైక్రోసాప్ట్ సంయుక్తంగా నిర్వహించిన ఓ సదస్సులో ఫేస్‌బుక్‌కు చెందిన మార్క్ జూకర్బెర్గ్, ఆలీబాబాకు చెందిన జాక్ మా, మైక్రోసాప్ట్ కు చెందిన సత్య నాదెండ్ల, ఆపిల్‌కు చెందిన టిమ్ కుక్, అమెజాన్‌కు చెందిన జెఫ్ బెజోస్, మరో 24 మంది ఐటీ దిగ్గజాలు అమెరికా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్‌తో కలసి ఇలా ఫొటో దిగారు. చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌ను కలుసుకొని, ఆయనతో మాట్లాడేందుకు మార్క్ జూకర్బెర్గ్ లాంటి దిగ్గజమే పోటీ పడడం విశేషం. పైగా ఆయన జింగ్‌పింగ్‌తో చైనా భాషలోనే మాట్లాడారు. ఓ ప్రపంచ అగ్ర నేతను తాను కలసుకోవడం, ఆయనతో విదేశీ భాషలోనే మాట్లాడడం తనకు ఇదే మొదటిసారంటూ జూకర్బెర్గ్ ఫేస్బుక్లో కామెంట్ పోస్ట్ చేశారు. ఈ పర్యటన విశేషాలను తాను ఎప్పటికప్పుడు ఫేస్బుక్ ద్వారా యూజర్లతో పంచుకుంటానని కూడా తెలిపారు. ఈ అరుదైన ఫొటోలో ఒక్కొక్కరిని పేరు పేరున పేర్కొనాలంటే....మొదటి వరుసలో ఎడమ వైపు నుంచి మార్క్ జూకర్బెర్గ్, జేడీ డాట్ కామ్- లియు క్వియాంగ్డాంగ్, సీస్కో- జాన్ చాంబర్స్, ఆలీబాబా- జాక్ మా, ఐబీఎం- జిన్నీ రొమెట్టీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, మైక్రోసాఫ్ట్- సత్య నాదెండ్ల, చైనా ఇంటర్నెట్- జార్ లూ వీ, ఆపిల్- టిమ్ కుక్, టెన్సెంట్-పోనీ మా, అమెజాన్-జెఫ్ బెజోస్. మధ్య వరుసలో ఎడమ నుంచి కుడికి....సోహు- ఝాంగ్ చయోయంగ్, ఏఎండీ-లీసా సూ, లెనోవ్స్- యాంగ్ యుయాంగింగ్, మైక్రోసాఫ్ట్-హారి శమ్, క్యుయాల్కమ్స్- స్టీఫ్ మొటెన్కోఫ్, సీఈటీసీ-జియాంగ్ క్యూన్లీ, ఇంటెల్-బ్రియాన్ క్రజానిచ్, కిహు 360-జౌ హోంగై, లింకెడిన్- రీడ్ హోఫ్మన్, సినా-కావో గూవీ. మూడవ వరుసలో ఎడమ నుంచి కుడికి....సుగాన్స్-లీ జున్, డీడీ కువైదీ-చెంగ్ వీ, బ్రాడ్‌బ్యాండ్ కాపిటల్-టియాన్ సునింగ్, సీఈసీ-లియు లీహాంగ్, బైదు-ఝాంగ్ యాకిన్, ఏఎంఈ క్లౌడ్స్-జెర్రీ యాంగ్, ఇన్స్పర్-సన్ పిషు, ఎయిర్బిన్బీస్-బ్రియాన్ చెస్కీ, సెకోయియా కాపిటల్-షెన్ నాన్పెంగ్.