ఐటీ దిగ్గజాల అరుదైన కలయిక | ever seem ziclernerg,nadella, cook, bezos together? | Sakshi
Sakshi News home page

ఐటీ దిగ్గజాల అరుదైన కలయిక

Sep 26 2015 4:47 PM | Updated on Sep 3 2017 10:01 AM

ఐటీ పరిశ్రమకు చెందిన దిగ్గజాలు ఒకో చోట కలుసుకోవడమే చాలా అరుదు. అటువంటిది ఇంటెర్నెట్ సామ్రాజ్యంలో మకుటంలేని రారాజులుగా రాణిస్తున్న ...

వాషింగ్టన్: ఐటీ పరిశ్రమకు చెందిన దిగ్గజాలు ఒకో చోట కలుసుకోవడమే చాలా అరుదు. అటువంటిది ఇంటెర్నెట్ సామ్రాజ్యంలో మకుటంలేని రారాజులుగా రాణిస్తున్న 29 మంది ఒకచోట కలుసుకోవడమే కాకుండా కలిసి ఫొటో దిగడం మరింత అరుదు. అలాంటి అరుదైన సంఘటనకు వాషింగ్టన్, రెడ్‌మాండ్‌లోని మైక్రోసాప్ట్ ప్రధాన క్యాంపస్ వేదికైంది. చైనా, మైక్రోసాప్ట్ సంయుక్తంగా నిర్వహించిన ఓ సదస్సులో ఫేస్‌బుక్‌కు చెందిన మార్క్ జూకర్‌బెర్గ్, ఆలీబాబాకు చెందిన జాక్ మా, మైక్రోసాప్ట్ కు చెందిన సత్య నాదెండ్ల, ఆపిల్‌కు చెందిన టిమ్ కుక్, అమెజాన్‌కు చెందిన జెఫ్ బెజోస్, మరో 24 మంది ఐటీ దిగ్గజాలు అమెరికా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్‌తో కలసి ఇలా ఫొటో దిగారు.

చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌ను కలుసుకొని, ఆయనతో మాట్లాడేందుకు మార్క్ జూకర్‌బెర్గ్ లాంటి దిగ్గజమే పోటీ పడడం విశేషం. పైగా ఆయన జింగ్‌పింగ్‌తో చైనా భాషలోనే మాట్లాడారు. ఓ ప్రపంచ అగ్ర నేతను తాను కలసుకోవడం, ఆయనతో విదేశీ భాషలోనే మాట్లాడడం తనకు ఇదే మొదటిసారంటూ జూకర్‌బెర్గ్ ఫేస్‌బుక్‌లో కామెంట్ పోస్ట్ చేశారు. ఈ పర్యటన విశేషాలను తాను ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్ ద్వారా యూజర్లతో పంచుకుంటానని కూడా తెలిపారు.

ఈ అరుదైన ఫొటోలో ఒక్కొక్కరిని పేరు పేరున పేర్కొనాలంటే....మొదటి వరుసలో ఎడమ వైపు నుంచి మార్క్ జూకర్‌బెర్గ్, జేడీ డాట్ కామ్- లియు క్వియాంగ్‌డాంగ్, సీస్కో- జాన్ చాంబర్స్, ఆలీబాబా- జాక్ మా, ఐబీఎం- జిన్నీ రొమెట్టీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, మైక్రోసాఫ్ట్- సత్య నాదెండ్ల, చైనా ఇంటర్నెట్- జార్ లూ వీ, ఆపిల్- టిమ్ కుక్, టెన్సెంట్-పోనీ మా, అమెజాన్-జెఫ్ బెజోస్.

మధ్య వరుసలో ఎడమ నుంచి కుడికి....సోహు- ఝాంగ్ చయోయంగ్, ఏఎండీ-లీసా సూ, లెనోవ్స్- యాంగ్ యుయాంగింగ్, మైక్రోసాఫ్ట్-హారి శమ్, క్యుయాల్‌కమ్స్- స్టీఫ్ మొటెన్‌కోఫ్, సీఈటీసీ-జియాంగ్ క్యూన్లీ, ఇంటెల్-బ్రియాన్ క్రజానిచ్, కిహు 360-జౌ హోంగై, లింకెడిన్- రీడ్ హోఫ్‌మన్, సినా-కావో గూవీ.

 మూడవ వరుసలో ఎడమ నుంచి కుడికి....సుగాన్స్-లీ జున్, డీడీ కువైదీ-చెంగ్ వీ, బ్రాడ్‌బ్యాండ్ కాపిటల్-టియాన్ సునింగ్, సీఈసీ-లియు లీహాంగ్, బైదు-ఝాంగ్ యాకిన్, ఏఎంఈ క్లౌడ్స్-జెర్రీ యాంగ్, ఇన్‌స్పర్-సన్ పిషు, ఎయిర్‌బిన్‌బీస్-బ్రియాన్ చెస్కీ, సెకోయియా కాపిటల్-షెన్ నాన్‌పెంగ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement