గత ఆర్థిక సంవత్సరంలో భారత విమానయాన సంస్థల నష్టాలు రూ.10 వేల కోట్లకు పైబడి ఉంటాయని ‘కాపా’ అంచనా వేస్తోంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నష్టాల(రూ.12,700 కోట్ల)తో పోల్చితే ఇది 18 శాతం తక్కువని విమానయాన రంగ మేథో సంస్థ- సెంటర్ ఫర్ ఏషియా పసిఫిక్ ఏవియేషన్(కాపా) వెల్లడించింది.
పనాజి: గత ఆర్థిక సంవత్సరంలో భారత విమానయాన సంస్థల నష్టాలు రూ.10 వేల కోట్లకు పైబడి ఉంటాయని ‘కాపా’ అంచనా వేస్తోంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నష్టాల(రూ.12,700 కోట్ల)తో పోల్చితే ఇది 18 శాతం తక్కువని విమానయాన రంగ మేథో సంస్థ- సెంటర్ ఫర్ ఏషియా పసిఫిక్ ఏవియేషన్(కాపా) వెల్లడించింది. ఇక్కడ జరిగిన ఐసీటీ ఏవియేషన్ ఫోరమ్ 2013లో ఈ నివేదికను వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం విమానయాన పరిశ్రమ టర్నోవర్ 9 శాతం వృద్ధితో రూ.54,000 కోట్లకు పెరిగిందని పేర్కొంది. అంతర్జాతీయ కార్యకలాపాల ఆదాయం 4.1 శాతం పెరిగిందని తెలిపింది. రూపాయి పతనం, చమురు ధరలు భగ్గుమనడం వంటి సమస్యలు తలెత్తాయని వివరించింది. కింగ్‌ఫిషర్ కార్యకలాపాలు ఆగిపోవడం చెప్పుకోదగ్గ సంఘటన అని పేర్కొంది.