breaking news
aviation organisation
-
రాష్ట్రానికి కేంద్ర విద్యా సంస్థలు కలేనా?
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఏవియేషన్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఇప్పట్లో రాష్ట్రానికి రాకపోతే కలగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. ఒకట్రెండు నెలల్లో వాటి ఏర్పాటుకు స్పష్టమైన ఉత్తర్వులతోపాటు నిధులు మంజూ రు కాకపోతే మరో మూడేళ్ల వరకు అవి వచ్చే అవకా శమే లేదు. ముందస్తు ఎన్నికల సూచనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాటిపై పెద్దగా దృష్టి పెట్టే అవకాశం లేనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, కేంద్రం నుంచి రావాల్సిన ఆమోదాలు, నిధులకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణపై దృష్టి సారించింది. రాష్ట్ర ఎంపీల సహకారంతో వచ్చే పార్లమెంటు సమావేశాల్లోగా వాటిని సాధించాలని ఆలోచన చేస్తున్నా.. ఎంత మేరకు ఆచరణ సాధ్యం అవుతుందన్నది వేచి చూడాల్సిందే. విభజన చట్టంలోనే హామీ ఇచ్చినా.. ఐఐఎం, గిరిజన యూనివర్సిటీ, ఏవియేషన్ యూనివర్సిటీ, కరీంనగర్లో మౌలానా అబుల్‌కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ క్యాంపస్ కోసం రాష్ట్ర ఎంపీలతోపాటు ముఖ్యంగా ఐటీ మంత్రి కె.తారకరామారావు, ఎంపీ వినోద్‌కుమార్ పలుమార్లు ప్రత్యేకంగా కేంద్ర మంత్రులు, అధికారులతో చర్చించారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు అంశం అయితే రాష్ట్ర విభజన చట్టంలోనే పొందుపరిచారు. అయినా ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. నాలుగేళ్లలో స్థల పరిశీలన, నిధుల కేటాయింపు, తనిఖీలతోనే సరిపోయింది. వరంగల్ జిల్లా ములుగులో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమి సరిపోదని, నిబంధనల ప్రకారం లేదంటూ కేంద్రం కొర్రీ వేసినట్లు తెలిసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు కూడా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే కేంద్రం మెలిక కారణంగా ప్రారంభానికి నోచుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు వరంగల్ ప్రాంతంలోనే ఐఐఎం ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగానే స్పందించినా ఒక్క అడుగు కూడా ముందు కు పడలేదు. మరోవైపు ఏవియేషన్ యూనివర్సిటీ, కరీంనగర్లో ఉర్దూ యూనివర్సిటీ పరిస్థితి అలాగే ఉండిపోయింది. ఈ ఐదారు నెలల్లో కనుక వాటిని సాధించుకోకపోతే వచ్చే మూడేళ్ల దాకా అవి వచ్చే అవకాశమే ఉండదని, తరువాత ఏ ప్రభుత్వం వస్తుం దో.. వచ్చినా అదెలా స్పందిస్తుందో తెలియని స్థితి ఉంటుందని అధికారులు భావిస్తు న్నారు. అందుకే వచ్చే వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో వాటి కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. -
100 విమానాలు కొంటున్న స్పైస్‌జెట్
♦ బోయింగ్, ఎయిర్‌బస్‌లతో చర్చలు ♦ విలువ 11 బిలియన్ డాలర్లు! న్యూఢిల్లీ : దీర్ఘకాలిక వ్యాపార ప్రణాళికల్లో భాగంగా విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తాజాగా సుమారు 100 కొత్త విమానాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం విమానాల తయారీ సంస్థలు బోయింగ్, ఎయిర్‌బస్ మొదలైన వాటితో చర్చలు జరుపుతున్నట్లు సంస్థ సీఎఫ్‌వో కిరణ్ కోటేశ్వర్ వెల్లడించారు. బొంబార్డియర్, ఏటీఆర్, ఎంబ్రేయర్ లాంటి చిన్న విమానాల కోసం చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ఇప్పుడే మొదలైందని, ఆర్డర్లు ఇచ్చేందుకు 3-6 నెలల సమయం పట్టొచ్చని కోటేశ్వర్ పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన 42 బోయింగ్ మ్యాక్స్ జెట్ల డెలివరీ 2018 నుంచి ప్రారంభం కావొచ్చని ఆయన వివరించారు. విమానాల కొనుగోలు డీల్ విలువ సుమారు రూ. 70,500 కోట్లు (11 బిలియన్ డాలర్లు) ఉండొచ్చని అంచనా. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిన స్పైస్‌జెట్ వరుసగా రెండో త్రైమాసికంలోనూ లాభాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. జూన్‌తో ముగిసిన క్వార్టర్లో నికర లాభం రూ. 72 కోట్లు. అంతక్రితం ఇదే వ్యవధిలో సంస్థ రూ. 124 కోట్ల నష్టం చవిచూసింది. ప్రస్తుతం సంస్థ వద్ద 34 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. గతేడాది రూ. 26,000 కోట్లు విలువ చేసే 42 బోయింగ్ 737 మ్యాక్స్ జెట్ విమానాలకు ఆర్డరు ఇచ్చింది. -
విమానయాన నష్టాలు రూ.10 వేల కోట్లు!
పనాజి: గత ఆర్థిక సంవత్సరంలో భారత విమానయాన సంస్థల నష్టాలు రూ.10 వేల కోట్లకు పైబడి ఉంటాయని ‘కాపా’ అంచనా వేస్తోంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నష్టాల(రూ.12,700 కోట్ల)తో పోల్చితే ఇది 18 శాతం తక్కువని విమానయాన రంగ మేథో సంస్థ- సెంటర్ ఫర్ ఏషియా పసిఫిక్ ఏవియేషన్(కాపా) వెల్లడించింది. ఇక్కడ జరిగిన ఐసీటీ ఏవియేషన్ ఫోరమ్ 2013లో ఈ నివేదికను వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం విమానయాన పరిశ్రమ టర్నోవర్ 9 శాతం వృద్ధితో రూ.54,000 కోట్లకు పెరిగిందని పేర్కొంది. అంతర్జాతీయ కార్యకలాపాల ఆదాయం 4.1 శాతం పెరిగిందని తెలిపింది. రూపాయి పతనం, చమురు ధరలు భగ్గుమనడం వంటి సమస్యలు తలెత్తాయని వివరించింది. కింగ్‌ఫిషర్ కార్యకలాపాలు ఆగిపోవడం చెప్పుకోదగ్గ సంఘటన అని పేర్కొంది.