బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మరో రసవత్తర పోరుకు తెరలేచింది.
రాంచీ: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మరో రసవత్తర పోరుకు తెరలేచింది. రాంచీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నాలుగు టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమం కావడంతో ఈ టెస్టు అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ క్రికెట్ సంఘం స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌పై అందరి దృష్టి నెలకొంది.
తొలి టెస్టులో చిత్తుగా ఓడిన భారత్, రెండో టెస్టులో ఘన విజయం సాధించి మళ్లీ రేసులోకి దూసుకొచ్చింది. గత మ్యాచ్ పరాజయం తర్వాత కోలుకునే ప్రయత్నంలో ఉన్న ఆసీస్ కూడా మ్యాచ్ కోసం బాగా సన్నద్ధమైంది. మ్యాచ్‌కు ముందురోజు రెండు జట్ల కెప్టెన్‌లు మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్‌ను కలిశారు.