యాహూ హ్యాకర్‌ ఎవరో తెలుసా? | Alleged Yahoo hacker worked at Prokhorov bank | Sakshi
Sakshi News home page

యాహూ హ్యాకర్‌ ఎవరో తెలుసా?

Mar 19 2017 8:37 AM | Updated on Sep 5 2017 6:31 AM

యాహూ హ్యాకర్‌ ఎవరో తెలుసా?

యాహూ హ్యాకర్‌ ఎవరో తెలుసా?

యాహూలో దాదాపు 50 కోట్ల మంది ఖాతాదారుల వివరాలను తస్కరించిన హ్యాకర్‌ రష్యాలో ఓ బ్యాంకు ఉద్యోగని తేలింది.

మాస్కో : యాహూలో దాదాపు 50 కోట్ల మంది ఖాతాదారుల వివరాలను తస్కరించిన హ్యాకర్‌ రష్యాలో ఓ బ్యాంకు ఉద్యోగని తేలింది. రష్యన్‌ వ్యాపార దిగ్గజం మిఖాయిల్‌ ప్రోఖొరోవ్‌కు చెందిన రినైసెన్స్‌ బ్యాంకులో హ్యాకర్‌ ఇగొర్‌ సుష్‌సిన్‌ సెక్యూరిటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు రష్యన్‌ బిజినెస్‌ పత్రిక కొమ్మెర్‌సాంట్‌ తెలిపింది. 

అమెరికా సర్కారు హ్యాకింగ్‌ కేసులో నిందితునిగా ప్రకటించడానికి ఒక రోజు ముందే బ్యాంకులో సుష్‌సిన్‌ పదవీకాలం ముగిసింది. దీనిపై స్పందించడానికి రినైసెన్స్‌ బ్యాంకు నిరాకరించింది. ఇతనితో పాటు మరో నలుగురిని రష్యన్‌ ఫెడరల్‌ ఏజెంట్లుగా గుర్తిస్తూ సదరు పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.   
 

Advertisement

పోల్

Advertisement