ఆర్‌బీఐ మరో సరప్రైజ్‌ ఇవ్వనుందా? | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ మరో సరప్రైజ్‌ ఇవ్వనుందా?

Published Thu, Apr 6 2017 9:14 AM

ఆర్‌బీఐ మరో  సరప్రైజ్‌  ఇవ్వనుందా?

న్యూఢిల్లీ : ఆశ్చర్యకరమైన హాట్రిక్  సర్‌ప్రైజ్‌ ల తర్వాత, మరో ఆశ్చర్యకరమైన నిర్ణయాన్ని ఆర్‌బీఐ ప్రకటించనుందా? రిజర్వ్‌ బ్యాంక్‌  మానిటరీ పాలసీ రివ్యూ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనుంది. ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) గురువారం మరోసారి తన ద్రవ్య, పరపతి విధానాన్ని  మధ్యాహ్నం 2.30 తరువాత ప్రకటించనుంది. ఇందుకోసం ఆర్‌బిఐ గవర్నర్‌ ఉర్జిత పటేల్‌ అధ్యక్షతన ఈ కమిటీ బుధవారం సమావేశమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమీక్షలోనూ కీలకమైన రెపో రేటును యథాతథంగానే కొనసాగించే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా. కీలక వడ్డీ రేటు  లేదా రెపోరేటు 6.25 దగ్గర స్థిరంగా ఉంచే అవకాశం ఉందని  ఎనలిస్టులు భావిస్తున్నారు.  రాయిటర్స్  కు చెందిన 60మంది ఆర్థికవేత్తలు..  ఆరుగురు సభ్యులు ద్రవ్య విధాన కమిటీ రెపో రేటు అక్టోబర్‌ నాటి స్థాయినే యధాతధంగా కొనసాగించవచ్చని అంచనా వేశారు. 

అయితే ఆర్‌బీఐ అక్టోబర్‌ లో అనూహ్యంగా వడ్డీరేట్ల కోత విధించింది. ఫిబ్రవరిలో కూడా ఆర్‌బీఐ"తటస్థ" వైఖరితో  ఆశ్చర్యపరిచింది.. ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థపై పెద్ద నోట్ల రద్దుపై స్పష్టమైన అవగాహన ఏర్పడిన తర్వాతే ‘రెపో’ రేటు తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటామని  ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ఫిబ్రవరి సమీక్షలోనే ప్రకటించారు.   ఈ నేపథ్యంలో ఆర్‌బిఐ కీలకమైన వడ్డీ రేట్లను పావు శాతం అటుఇటుగా మార్చే అవకాశం ఉందని  అంచనా.

జీఎస్‌టీ, 7వ వేతన సంఘం, ద్రవ్యోల్బణం, పెరుగుతున్నకూరగాయల ధరల ఆందోళనల నేపథ్యంలో ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయం బ్యాంకులు బాండ్లపై నెగిటివ్‌ ప్రభావాన్ని  చూపిస్తుందని విశ్లేషిస్తున్నారు. అలాగే ఎలనినో భయాలు ఆహార ధరలను పైకి నెట్టొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.  టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 39 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. ఆహార, ఇంధన ధరలూ పెరుగుతున్నాయి. మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వు కూడా వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలో ఎంపిసి ఈ సారి కూడా రెపో రేటు తగ్గింపువైపు మొగ్గు చూపక పోవచ్చని భావిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దాదాపు రూ.14 లక్షల కోట్ల నగదు చేరింది.  దీంతో చలామణి నుంచి తొలగించేందుకు ఈ పరపతి సమీక్షలో ఆర్‌బిఐ చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు. స్టాండింగ్‌ డిపాజిట్‌ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్‌) వంటి చర్యలను ఆర్‌బీఐ తీసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్ర బ్యాంకు యొక్క ప్రధాన దృష్టి  తటస్థ విధానం కంటే బ్యాంకుల  లిక్విడిటీని తొలగించే చర్య ఎక్కువగా ఉండనుందని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త అభీక్ బారువా అభిప్రాయపడ్డారు.

 

Advertisement
Advertisement