సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష అడ్మిట్ కార్డుల్లో ఫొటో సరిగ్గా లేనట్లయితే గుర్తింపు కార్డుగా ఆధార్‌ను తీసుకురావొచ్చు.
న్యూఢిల్లీ: వచ్చేనెల 18న జరగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు జారీ చేసిన అడ్మిట్ కార్డుల్లో ఫొటో సరిగ్గా లేనట్లయితే గుర్తింపు కార్డుగా ఆధార్‌ను కూడా తీసుకురావచ్చని యూపీఎస్సీ స్పష్టం చేసింది.
ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, ఎన్నికల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దానిని గుర్తింపు కార్డుగా తీసుకురావచ్చని తెలిపింది. వీటితో పాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలను కూడా తప్పనిసరిగా తీసుకు రావాలని యూపీఎస్సీ పేర్కొంది.