పడవను ఢీకొన్న నౌక, 15మంది గల్లంతు

పడవను ఢీకొన్న నౌక, 15మంది గల్లంతు - Sakshi


జకర్తా: ఇండోనేసియాలోని తూర్పు జావా ప్రావిన్స్లో పడవను నౌక ఢీకొట్టిన ఘటనలో కనీసం 15 మంది గల్లంతయ్యారు. శనివారం తుర్బాన్ జిల్లా జలాల్లో వియత్నాం నౌక, ఇండోనేసియా పడవ ఢీకొన్నాయి. ఇండోనేసియా పడవలో 27 మంది ప్రయాణికులు ఉన్నారు.ఈ ప్రమాదంలో గల్లంతయిన వారందరూ పడవలో ప్రయాణిస్తున్న వారేనని అధికారులు చెప్పారు. పడవలో ఉన్నవారిలో 12 మందిని సురక్షితంగా కాపాడమని తెలిపారు. మిగిలివారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. తూర్పు జావా ప్రావిన్స్ రాజధాని సురబయలోని ఓడరేవుకు వియత్నాం నౌక వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిపారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top