ఎదురు కాల్పులు.. 11 మంది మావోయిస్టుల అరెస్టు | 11 maoists arrested after crossfire in chhattisgarh | Sakshi
Sakshi News home page

ఎదురు కాల్పులు.. 11 మంది మావోయిస్టుల అరెస్టు

Mar 15 2014 10:05 AM | Updated on Oct 9 2018 2:39 PM

ఛత్తీస్గఢ్లో మరోసారి పోలీసులు.. మావోయిస్టులు తలబడ్డారు. ఈసారి పోలీసులు మావోయిస్టులపై ఆధిక్యం సాధించి 11 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు.

ఛత్తీస్గఢ్లో మరోసారి పోలీసులు.. మావోయిస్టులు తలబడ్డారు. ఇటీవల 15 మంది పోలీసులను మావోయస్టులు మందుపాతర పేల్చి, కాల్పులు జరిపి హతమారిస్తే, ఇప్పుడు ఈసారి పోలీసులు మావోయిస్టులపై ఆధిక్యం సాధించారు. ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్ జిల్లా లాసూన్‌పట్ అటవీప్రాంతంలో పోలీసులకు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో 11 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. ఈ సంఘటనలో భారీ మొత్తంలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికలకు మావోయస్టులు ఎలాంటి ఆటంకం కలిగించకుండా ఉండాలన్న ఉద్దేశంతో పోలీసులు, పారామిలటరీ బలగాలు కలిసి భారీ ఎత్తున కూంబింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా మావోయస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని దంతెవాడ ప్రాంతం, ఏవోబీ లాంటి ప్రాంతాలను బలగాలు జల్లెడ పడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement