రంగారెడ్డి జిల్లాలో బుధవారం సాయంత్రం ఓ జెడ్పీటీసీ సభ్యుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
తాండూరు: రంగారెడ్డి జిల్లాలో బుధవారం సాయంత్రం ఓ జెడ్పీటీసీ సభ్యుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తాండూరుకు చెందిన జెడ్పీటీసీ సురేష్‌బాబుకు, బెల్లంపల్లికి చెందిన వరలక్ష్మి అనే మహిళకు మధ్య కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది.
అయితే, సదరు భూమిని తనకు దక్కుకుండా చేస్తున్నారనే ఆవేదనతో సురేష్‌బాబు తాండూరు తహశీల్దార్ కార్యాలయం ముందు పురుగుల ముందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆయనను సమీప ఆస్పత్రికి తరలించారు.


