ప్రధాని ప్రయాణించిన మెట్రోకు ఓ ప్రత్యేకత.. | young woman loco Pilot takes PM modi on a Ride in Hyderabad Metro | Sakshi
Sakshi News home page

ప్రధాని ప్రయాణించిన మెట్రోకు ఓ ప్రత్యేకత..

Nov 28 2017 3:30 PM | Updated on Sep 4 2018 3:39 PM

young woman loco Pilot takes PM modi on a Ride in Hyderabad Metro  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భాగ్యనగరం మెడలో మెట్రో మణిహారం అందంగా కొలువుతీరింది. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో ప్రారంభమైంది. ప్రధాని ప్రయాణించిన మెట్రోకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ మెట్రో రైలును ఓ మహిళా పైలట్ నడపడం విశేషం. ప్రధాని ప్రయాణించిన ఈ మెట్రోను లోకో పైలట్‌ సుప్రియ నడిపారు.

మియాపూర్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో భాగ్యనగరి మెట్రో రైలు సర్వీసులను ప్రధాని మోదీ ఆరంభించిన విషయం తెలిసిందే. మొదట మెట్రో పైలాన్ ఆవిష్కరించిన ఆయన తర్వాత మియా పూర్ మెట్రో స్టేషన్ను ప్రారంభించారు. అనంతరం మన హైదరాబాద్-మన మెట్రోపై తయారు చేసిన ప్రత్యేక వీడియోను తిలకించారు. ఆ తర్వాత మెట్రో బ్రోచర్తో పాటు మెట్రో యాప్‌ను విడుదల చేశారు.

మియాపూర్‌లో స్వల్ప లాఠీఛార్జ్‌
మరోవైపు మెట్రో రైలు ప్రారంభం సందర్భంగా ఆ వేడుకను తిలకించేందుకు వచ్చిన స్థానికులను పోలీసులు అదుపు చేయలేకపోయారు. దీంతో మియాపూర్‌లో ఓ దశలో  స్వల్పంగా లాఠీచార్జ్‌ చేయాల్సి వచ్చింది. ఇక మెట్రో స్టేషన్‌ను ప్రారంభించిన అనంతరం ప్రధాని హెచ్‌ఐసీసీకి బయల్దేరి వెళ్లారు. అనంతరం ఒక్కసారిగా ట్రాఫిక్‌ వదలటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.





(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement