దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని
హుజూర్‌నగర్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్ కోరారు. మంగళవారం స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాలు, రైతుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవే శపెట్టి విజయవంతంగా అమలు చేసిన ఘనత వైఎస్సార్‌కు దక్కుతుందన్నారు. వైఎస్సార్ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించి ఆయన పాలనను స్వర్ణయుగంగా కీర్తించారన్నారు.
ప్రాంతాలకతీతంగా ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారన్నారు. వైఎస్సార్ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు నేటికీ ఆయన పాలనను మరువలేకపోతున్నారన్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాలలో వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించడంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు గుర్రం వెంకటరెడ్డి, యూత్‌విభాగం రాష్ట్ర కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు కోడి మల్లయ్యయాదవ్, పిల్లి మరియదాసు, సంపంగి నర్సింహ, జనార్దన్‌రావు తదితరులు పాల్గొన్నారు.