మీకు సైబర్‌ సేఫ్టీ తెలుసా?

Women Safety Wing Conduct Quiz Programme Over Cyber Crime - Sakshi

మహిళలు, విద్యార్థుల కోసం ప్రత్యేక క్విజ్‌

సాక్షి, హైదరాబాద్‌: మీరు ఎలాంటి పాస్‌వర్డ్స్‌ వాడుతున్నారు? ఆన్‌లైన్‌లో మీరు ఎంతమేరకు సురక్షితంగా ఉన్నారు? మీరు వ్యవహరించే తీరుతో మీకు ఎంతమేరకు భద్రత ఉంది? తదితర అంశాలపై విద్యార్థులు, మహిళల కోసం ‘విమెన్‌సేఫ్టీ వింగ్‌’ప్రత్యేక క్విజ్‌ చేపట్టింది. ఆన్‌లైన్‌ వినియోగం పెరిగిన నేపథ్యంలో సురక్షిత సైబర్‌ వాతావరణం కోసం, వేధింపుల నివారణ కోసం మహిళా రక్షణ విభాగం ఆధ్వర్యంలో ‘సైబ్‌హర్‌’(సైబర్‌ సేఫ్టీ ఫర్‌ హర్‌) అవగాహన ప్రాజెక్టులో భాగంగా గురువారం విద్యార్థులు, మహిళల కోసం క్విజ్‌ నిర్వహించారు. ఇందులో పాల్గొనే వారు ముందుగా సైబ్‌హర్‌ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి.

తరువాత మీకో ఐడీ ఇస్తారు. తరువాత 15 అంశాల ప్రశ్నావళికి జవాబులివ్వాలి. వీటికి విజయవంతంగా సమాధానం చెప్పిన వెంటనే మీకు ఆన్‌లైన్‌లో విజ్ఞానం ఉంది? ఏయే అంశాల్లో మీరు మెరుగుపడాలో అని వాటిని చూపిస్తుంది. వెంటనే మిమ్మల్ని అభినందిస్తూ డిజిటల్‌ సర్టిఫికెట్‌ కూడా అందజేస్తారు. దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒకసారి ఇందు లో ఐడీ క్రియేట్‌ చేసుకున్నాక.. ఈ నెల మొత్తం ఆన్‌లైన్‌లో నిర్వహించే ప్రతీ పోటీలోనూ పాల్గొనవచ్చు. ఇందులో భాగంగా గురువారం రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల నిర్వాహకులు, టీచర్లు, ఎన్జీవోలు, విద్యావేత్తలకు ఈ క్విజ్‌ పోటీ రిక్వెస్టులు పంపారు. తొలిరోజు సాయంత్రానికి దాదాపు 6వేలమందికిపైగా ఈ సర్టిఫికెట్‌ కోర్సులో పాల్గొనడం విశేషం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top