నక్సల్స్హ్రిత జిల్లాగా మారుస్తాం

నక్సల్స్హ్రిత జిల్లాగా మారుస్తాం - Sakshi


 సుబ్లేడు (తిరుమలాయపాలెం): దేశ భద్రత కోసం అంకితభావంతో సేవలందిస్తున్న పోలీసులను పొట్టనపెట్టుకుంటున్న నక్సలైట్ల(మావోయిస్టుల)ను పూర్తిగా ఏరివేస్తామని, నక్సల్స్హ్రిత జిల్లాగా మారుస్తామని ఎస్పీ ఎవి.ర ంగనాథ్ చెప్పారు. ఒడిశా సరిహద్దులోని బలిమెలలో 2008 జూన్ 29న జరిగిన నక్సల్స్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన గ్రేహం డ్స్ జూనియర్ కమాండర్ దుస్సా ఉదయ్‌నాగు జ్ఞాపకార్థం సుబ్లేడు గ్రామంలో నిర్మించిన బస్ షెల్టర్‌ను సోమవారం ఎస్పీ ప్రారంభించారు. ఉదయ్‌నాగు చిత్రపటం వద్ద పూలమాలలు ఉంచి నివాళులర్పించారు.

 

ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ... ఒడిశా సరిహద్దులో గ్రేహండ్స్ పార్టీ కూంబింగ్ నిర్వహించి స్టీమర్‌లో వెళుతున్న సమయంలో నక్సల్స్ దొంగచాటుగా దాడులు చేశారని చెప్పారు. ఈ దుర్ఘటనలో 34 మంది గ్రేహండ్స్ పోలీసులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. నక్సల్స్‌తో పోరాడుతూ ఉదయ్‌నాగు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ‘‘ఆ దుర్ఘటన తరువాత నన్ను గ్రేహండ్స్ ఎస్పీగా పంపించారు. గ్రేహం డ్స్ పోలీసులను చంపిన నక్సల్స్‌ను సాధ్యమైనంత వరకు అణచివేశాం.



ఆ తరువాత నక్సల్స్ వెనుకంజ వేశారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో న క్సల్స్ ఏరివేతకు పోలీసులు దృఢ సంక ల్పంతో ముందుకు సాగుతున్నారు. బలిమెల పోలీసు అమరవీరుల స్ఫూర్తితో జిల్లాను నక్సల్స్హ్రితంగా మారుస్తాం’’ అని అన్నారు. ఉదయ్‌నాగు పేరిట బస్ షెల్టర్ నిర్మించిన ఆయన కుటుంబీకులు అభినందనీయులని అన్నారు. శాంతి భద్రతలను మరింత సమర్థవంతంగా పరిరక్షించేందుకుగాను పోలీసింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్నట్టు చెప్పారు.

 

సమస్యలు తెలుసుకున్న ఎస్పీ

ఉదయ్‌నాగు తల్లి భాగ్యమ్మ, ఇతర కుటుంబీకులతో ఎస్పీ రంగనాథ్ మాట్లాడారు. తమకు ప్రభుత్వం నుంచి అన్నిరకాల ప్రయోజనాలు, పరిహారం అందినట్టు భాగ్యమ్మ చెప్పారు. రైల్వే పాస్ ఇవ్వడం లేదని చెప్పారు. ఎస్పీ స్పందిస్తూ.. ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ‘‘మీకు ఏవైనా సమస్యలుంటే నన్ను ఎప్పుడైనా కలవవచ్చు’’ అని చెప్పారు.



 కార్యక్రమంలో ఖమ్మం డీఎస్పీ బాలకిషన్‌రావు ఎస్సైలు ఓంకార్ యాదవ్, జాన్‌రెడ్డి, ఉదయ్‌నాగు తల్లి భాగ్యమ్మ, అన్న క్రిష్ణ, చెల్లెలు అరుణ, గ్రామ సర్పంచ్ రామసహాయం సునితారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు వనవాసం సురేష్‌రెడ్డి, గ్రామ పెద్దలు వసంతరెడ్డి, శ్రీరామ్, రాంచంద్రు, మాజీ ఎంపీపీ గంధసిరి రామయ్య, వార్డు సభ్యు లు పోలెపొంగు సంజీవులు, మాజీ సర్పంచ్ గంధసిరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top