'ఎన్టీఆర్ పేరు పెడితే చూస్తూ ఊరుకోం' | we oppose to ntr name to airport, says duddilla Sridhar babu | Sakshi
Sakshi News home page

'ఎన్టీఆర్ పేరు పెడితే చూస్తూ ఊరుకోం'

Jun 1 2014 2:21 PM | Updated on Sep 2 2017 8:10 AM

'ఎన్టీఆర్ పేరు పెడితే చూస్తూ ఊరుకోం'

'ఎన్టీఆర్ పేరు పెడితే చూస్తూ ఊరుకోం'

తెలంగాణలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని టీడీపీ ప్రతిపాదించడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

మంథని: తెలంగాణలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని టీడీపీ ప్రతిపాదించడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. అధికారం ఉందని ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్ష పార్టీగా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కరీంనగర్ జిల్లా మంథనిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్‌గాంధీ పేరిట నామకరణం చేశారన్నారు. కాగా, తెలంగాణ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండానే పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రలో కలిపేందుకు బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement