వనజీవి రామయ్యకు తీవ్ర అస్వస్థత | Wanajeevi Ramaiah suffers with health issues | Sakshi
Sakshi News home page

వనజీవి రామయ్యకు తీవ్ర అస్వస్థత

Jun 13 2017 6:34 AM | Updated on Aug 15 2018 9:40 PM

వనజీవి రామయ్యకు తీవ్ర అస్వస్థత - Sakshi

వనజీవి రామయ్యకు తీవ్ర అస్వస్థత

ఖమ్మం జిల్లా రూరల్‌ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మశ్రీ వనజీవి రామయ్య ఆదివారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

హైదరాబాద్‌ తరలించిన కుటుంబ సభ్యులు
ఖమ్మం‌: ఖమ్మం జిల్లా రూరల్‌ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మశ్రీ వనజీవి రామయ్య ఆదివారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబీకులు ఆయనను ఖమ్మం లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కొద్దికాలం క్రితం రామయ్యకు గుండెనొప్పి రావడంతో స్టంట్‌ వేశారు. మళ్లీ  గుండెనొప్పి రావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. కాగా.. స్టంట్‌ వేసిన సమయంలోనే బాగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయినప్పటకీ ఆయన మొక్కలు నాటడం మాత్రం మానుకోలేదు.

ప్రభుత్వ ఖర్చుతో వైద్యం
సాక్షి, హైదరాబాద్‌:  దరిపెల్లి రాములుకు పూర్తి ప్రభుత్వ ఖర్చుతో అత్యుత్తమ వైద్యం అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement