ఇవేం గుడ్లు..? | Very Bad eggs in anganwadis | Sakshi
Sakshi News home page

ఇవేం గుడ్లు..?

Aug 13 2015 10:36 PM | Updated on Jun 2 2018 8:32 PM

చూస్తే గుడ్డే అంటారు...కానీ మరో గుడ్డు పక్కన పెడితే మాత్రం వెరీ బ్యాడ్ అని తీరుతారు. ఎందుకంటారా..? తుంగతుర్తి నియోజకవర్గంలో అంగన్‌వాడీలకు

చూస్తే గుడ్డే అంటారు...కానీ మరో గుడ్డు పక్కన పెడితే మాత్రం వెరీ బ్యాడ్ అని తీరుతారు. ఎందుకంటారా..? తుంగతుర్తి నియోజకవర్గంలో అంగన్‌వాడీలకు పంపిణీ అవుతున్న గుడ్లను చూస్తే..ఇవి కోడి గుడ్లా లేక పిట్ట గుడ్లా అనే సందేహం వస్తుంది.
 - తిరుమలగిరి
 
 పేద పిల్లలు, బాలింతలు, పిల్లల తల్లులకు పౌష్టికాహారం అందించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల్లో గుడ్లను పంపిణీ చేస్తున్నారు. బాలింతలు, గర్భిణీలకు రోజుకు ఒక్కటి చొప్పున నెలకు 30 గుడ్లు, ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలకు వారానికి నాలుగు, మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు పిల్లలకు వారానికి ఆరు గుడ్లు పంపిణీ చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్లను సప్లయ్ చేయడానికి ప్రభుత్వం నిర్వహించే టెండర్లను గెలుచుకొని కాంట్రాక్టర్లు 15 రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. అయితే వీరు సరఫరా చేసే గుడ్లలో కొన్ని మాత్రం చిన్న సైజులో ఉంటున్నాయి. ఈ చిన్న సైజు గుడ్లలో ఏపాటి విటమిన్లు లభిస్తాయని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా మార్కెట్‌లో విక్రయించే గుడ్లతో పోలిస్తే ఇవి చిన్న సైజులో ఉంటున్నాయి.
 
 నెలకు 5లక్షల గుడ్లు పంపిణీ..
 తుంగతుర్తి నియోజకవర్గంలో 348 అంగన్‌వాడీ కేంద్రాల్లో 2807 మంది గర్భిణులు, 2386 మంది బాలింతలు, 1721 మంది ఆరు నెలల లోపు పిల్లలు, 9206 మంది మూడు నుంచి ఆరేళ్ల లోపు పిల్లలు, 5645 మంది మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు నెలకు 5 లక్షలకు పైగా గుడ్లను సరఫరా చేస్తున్నారు. అం గన్‌వాడీ కేంద్రాల్లో చిన్న గుడ్లు కూడా వస్తుండటంతో లబ్ధిదారులు సిబ్బంది తో ఇవేం గుడ్లు అని ప్రశ్నిస్తున్నారు.
 
 గుడ్లలోనే విటమిన్లు అదనం..
 మిగిలిన ఆహార పదార్థాల పోల్చితే కోడి గుడ్డులోనే అదనంగా కేలరీలు లభిస్తాయి. ఓ మోస్తరు సైజు ఉండే గుడ్డులో 60 క్యాలరీలు, 8 నుంచి 10 గ్రాముల విటమిన్లు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. చిన్న సైజు గుడ్లలో 30 కేరీలు, 4గ్రాముల విటమిన్లు కూడా ఉండే అవకాశం లేవని లబ్ధిదారులు చెబుతున్నారు. ఈ విషయంపై ఐసీడీఎస్ అధికారులను వివరణ కోరగా 50 గ్రాములలోపు ఉన్న కోడి గుడ్లను కాంట్రాక్టర్ల నుంచి తీసుకోవద్దని సిబ్బందికి చెప్పామని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement