పదవ తరగతి టాపర్లకు బంపర్ ఆఫర్ | Vandemataram Foundation offers Helicopter trip for 10th class toppers | Sakshi
Sakshi News home page

పదవ తరగతి టాపర్లకు బంపర్ ఆఫర్

Jun 9 2015 4:45 PM | Updated on Sep 4 2018 5:16 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఓ బంపర్ ఆఫర్ లభించింది.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఓ బంపర్ ఆఫర్ లభించింది. పదవ తరగతి టాపర్లను మంగళవారం అనుకోని అద్భుత అవకాశం వరించింది. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ విద్యార్థులకు విమానంలో విహరిస్తూ హైదరాబాద్ నగర అందాలను తిలకించే అవకాశం కల్పించింది వందేమాతరం ఫౌండేషన్.  హైదరాబాద్ బీఎన్‌రెడ్డి నగర్లో ఉన్న ఫ్లైటెక్ ఏవియేషన్ విమానాల్లో వారు విహరించనున్నారు. తమకు అనుకోని అవకాశం రావడంతో విద్యార్థులు ఆనందంతో తబ్బిబ్బయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement