తుంగభద్రలో వాజ్‌పేయి చితాభస్మం నిమజ్జనం

Vajpayee ashes immersed in Tungabhadra - Sakshi

జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్‌): భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి చితాభస్మాన్ని శనివారం తుంగభద్ర నదీ జలాల్లో నిమజ్జనం చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ వద్ద తుంగభద్ర నదిలో బీజేపీ శాసనసభా పక్షనేత కిషన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత నదీ తీరంలోని పుష్కరఘాట్‌లో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం ఉత్తర వాహిణి తుంగభద్ర నదిలోని పవిత్ర దేవద్రోణి తీర్థంలో చితాభస్మాన్ని కలిపి అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆత్మకు వైకుంఠ ప్రాప్తి కలగాలని కోరుతూ అర్ఘ్యం వదిలారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో పలువురు నాయకులు మాట్లాడుతూ వాజ్‌పేయి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు నాగూరావు నామోజీ, పద్మజరెడ్డి, తుమ్మల రవికుమార్, అశోక్, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top