తెలంగాణ అంటేనే బతుకమ్మ :ఉత్తమ్‌

Uttam Kumar Reddy On Bathukamma Festival - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలు సుఖ శాంతులతో, సంప్రదాయ బద్ధంగా జరుపుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అంటేనే బతుకమ్మ అని, మహిళలకు అత్యంత ప్రీతి పాత్రమైన పండుగల్లో బతుకమ్మ ప్రధానమైనదన్నారు. ఈ ఏడాది పల్లెలన్నీ ఆడపడుచులతో కళకళలాడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ నాలుగున్నరేళ్లలో తెలంగాణ ఆడ బిడ్డలను కేసీఆర్‌ ఘెరంగా అవమానించారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది బతుకమ్మ పండుగ కచ్చితంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top