బంద్‌కు సన్నద్ధం | Unions support in telagana bandu | Sakshi
Sakshi News home page

బంద్‌కు సన్నద్ధం

May 29 2014 3:31 AM | Updated on Oct 16 2018 6:47 PM

పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గురువారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో

  • ఉద్యోగ సంఘాల మద్దతు
  •  సాక్షి,సిటీబ్యూరో: పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గురువారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణవాదులు బంద్ ను విజయవంతం చేసేందుకు సన్నద్ధమయ్యారు. తెలంగాణ ఉద్యోగ, విద్యార్థి, కార్మిక సంఘాలు బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపాయి.
         
    జీహెచ్‌ఎంసీ గుర్తింపు కార్మిక సంఘం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపింది. పారిశుద్ధ్య విధులు మినహా మిగతా సేవలు నిలిపివేయనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు గోపాల్ తెలిపారు.
         
    తెలంగాణ  టీచర్స్ జేఏసీ సెక్రటరీ జనరల్ కమిషనర్ నియామకం మినహా మిగతా డీసీపీ మొదలు  అదనపు కమిషనర్ల వరకు ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారులనే కొన సాగించేలా ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు రానున్నాయి. అలాగే సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌తో పాటు అక్కడి డీసీపీలు జాయింట్ పోలీసు కమిషనర్ కూడా యథాతథంగా ఉంటారు. ఈ విషయంలో ఏమైనా మార్పులు చేర్పులు నెల, రెండు నెలల తరువాతే జరుగుతాయని అధికార వర్గాలను బట్టి తెలుస్తోంది.
     
    అనురాగ్‌శర్మ కోసం ప్రత్యేక ఉత్తర్వులు

    ఇదిలా ఉండగా ప్రస్తుతం అదనపు డీజీ హోదాలో ఉన్న  నగర పోలీసు కమిషనర్ స్థానాన్ని డీజీపీ హోదాకు పెంచుతూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు కేవలం డీజీ హోదాలో కొత్వాల్‌గా కొనసాగుతున్న అనురాగ్‌శర్మ కోసమే జారీ చేశారని తెలిసింది. తిరిగి కమిషనర్ స్థానాన్ని డీజీ స్థాయి నుంచి అదనపు డీజీ స్థాయికి కుదిస్తారని, బుధవారం వెలువడిన ఉత్తర్వులు తాత్కాలికమే అని తెలుస్తోంది.
     
    కొత్త కొత్వాల్ ముందు పెనుసవాళ్లు

    నగర 55వ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టబోయే అధికారి ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయి. రెండు రాష్ట్రాల సచివాలయాలు, అసెంబ్లీలు, రెండు రాష్ట్రాల ఆందోళనలకు హైదరాబాద్ కేంద్ర బిందువు కావడంతో బందోబస్తు పెద్ద సమస్యగా మారనుంది. దీంతో పాటు రోజువారి బందోబస్తు, క్రైమ్ అలర్ట్ తదితర విధులు  మన పోలీసులకు ఉండనే ఉన్నాయి. ఇంత పెద్ద సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ఉన్న నగర పోలీసు సిబ్బంది సంఖ్యకు మరో 5500 మంది కానిస్టేబుళ్లను పెంచాల్సిన అవసరం ఉందని ఇప్పటికే గవర్నర్‌తో పాటు ప్రభుత్వానికి డీజీపీ ప్రసాదరావు ప్రతిపాదనలు పంపారు. దీంతో పాటు రెండు  ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ (ఐఆర్)లు కూడా అవసరం ఉంటుందని ప్రతిపాదనలో పేర్కొన్నారు.  
     
    మహేందర్‌రెడ్డి నేపథ్యం...

    మహేందర్‌రెడ్డి 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా రాష్ట్ర కేడర్‌కు ఎంపికయ్యాక నిజామాబాద్ ఎస్పీగా,  నగర తూర్పు మండలం డీసీపీగా జాతీయ పోలీస్ అకాడమీలో ఎస్పీ స్థాయిలో పనిచేసి అక్కడే డీఐజీ స్థాయిలో పదోన్నతి పొందారు. అనంతరం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ (ఫిబ్రవరి 12, 2003) ఏర్పడిన తరువాత  తొలి కమిషనర్‌గా నియమితులయ్యారు.  నాలుగేళ్ల అనంతరం  ఇంటెలిజెన్స్ ఐజీగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడే అదనపు డీజీగా పదోన్నతి పొంది ఆ విభాగానికి అధిపతి అయ్యారు. దాదాపు ఐదు సంవత్సరాలకు పైగానే ఆయన నిఘా విభాగాధిపతిగా కొనసాగుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement