వడదెబ్బకు ఇద్దరు మృతి | two died due to sunstroke in telangana | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు ఇద్దరు మృతి

Apr 23 2016 10:17 AM | Updated on Oct 8 2018 5:07 PM

ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో వడదెబ్బ బారిన పడి అనారోగ్యంతో మృతిచెందుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది.

హైదరాబాద్: ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో వడదెబ్బ బారిన పడి అనారోగ్యంతో మృతిచెందుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకరు, ఖమ్మం జిల్లాలో ఒకరు మృతి చెందారు.

మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం నిజలాపూర్ గ్రామానికి చెందిన ఎం.బుచ్చమ్మ (60) గురువారం వడదెబ్బకు గురైంది. అస్వస్థతతో బాధపడుతున్న ఆమెను స్థానిక వైద్యుడికి చూపించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి ఆమె మృతి చెందింది. అలాగే, ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం అలియాతండాలో వడదెబ్బ కారణంగా భూక్యా జగన్ అస్వస్థతకు గురై శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement