కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన పాదయాత్రపై తెలంగాణ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
హైదరాబాద్:కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన పాదయాత్రపై తెలంగాణ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రాహుల్ పాదయాత్రను స్వాగతిస్తున్నామని అంటూనే కాంగ్రెస్ అనుసరిస్తున్న ప్రస్తుత వైఖరిని తప్పుబట్టారు. గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో 24వేలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నాపట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.
రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన కాంగ్రెస్ కు ఆ రోజే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రైతు కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఆనాటి కాంగ్రెస్ పాలను ఇప్పడు టీఆర్ఎస్ కంటిన్యూ చేస్తోందని దుయ్యబట్టారు.