అనుమతి లేకుండా విధుల్లోకి తీసుకోవద్దు 

TSRTC Officers Orders To Depot Manager Not To Admit Eliminated Employees - Sakshi

డీఎంలకు ఉన్నతాధికారుల ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌ : సమ్మెలో ఉన్నవారిని తిరిగి విధుల్లోకి తీసుకోబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేయడంతో ఆర్టీసీ అధికారులు రంగంలోకి దిగారు. శనివారం సాయంత్రం ఆరులోపు వచి్చనవారు మినహా మిగతా ఎవరినీ విధుల్లోకి తీసుకోవద్దని అన్ని డిపోల మేనేజర్లకు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈమేరకు వారికి వాట్సాప్‌ ద్వారా ఆదివారం సమాచారం అందించట మే కాకుండా, ఫోన్లు చేసి కూడా చెప్పారు. ఎవరైనా తిరిగి విధుల్లోకి చేరేందు కు ఆసక్తిగా ఉంటే వారి వివరాలను బస్‌భవన్‌కు తెలపాలని, అక్కడి నుంచి అనుమతి రాకుం డా ఏ స్థాయి సిబ్బందిని కూడా విధుల్లో చేర్చుకోవద్దని హెచ్చరించారు. 

ఆందోళనలో కార్మికులు 
వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు సాధ్యం కాదని, కారి్మకులు ఆందోళన చెందాల్సిన పనిలేదని కారి్మక సంఘం నేతలు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా కొందరు మాత్రం తాజా నిర్ణయంతో కలవర పడుతున్నారు. వారు తమ డిపో మేనేజర్లకు ఫోన్‌ చేసి తమ ఉద్యోగాలు ఉంటాయా, నిజంగానే తొలగించినట్టేనే అని వాకబు చేస్తున్న ట్టు తెలిసింది. నగరంలోని ఓ డిపో మేనేజర్‌కు ఆదివారం రాత్రి పొద్దుపోయాక ఓ డ్రైవర్‌ ఫోన్‌ చేసి, ఉద్యోగం పోవటం తట్టుకోలేకపోతున్నానని, తాను ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నాడు. దీంతో అలాంటి  నిర్ణయాలు తీసుకోవద్దని, సోమవారం వచ్చి మాట్లాడాలని, అప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ధైర్యం చెప్పారు.

న్యాయ సలహా తీసుకున్న అధికారులు 
ఒకేసారి దాదాపు 49 వేల మంది ఉద్యోగులపై వేటు వేసే నిర్ణయం తీసుకుంటే న్యాయపరంగా చిక్కులొచ్చే అవకాశం ఉందేమోనని అధికారులు ముందుగానే వాకబు చేశారు. సీఎం వద్దకు వెళ్లేముందే న్యాయ సలహా తీసుకున్నట్టు తెలిసింది. పర్యవసానాలను పరిశీలించిన తర్వాతనే సీఎం ఆ ప్రకటన చేసినట్టు చెబుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top