11 నుంచి పాలీసెట్‌ ఫైనల్‌ కౌన్సెలింగ్‌  | TS Polycet Final Counseling On June 11 | Sakshi
Sakshi News home page

11 నుంచి పాలీసెట్‌ ఫైనల్‌ కౌన్సెలింగ్‌ 

Jun 7 2018 2:45 AM | Updated on Jun 7 2018 2:45 AM

TS Polycet Final Counseling On June 11 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాలీసెట్‌–2018 తుదివిడత కౌన్సెలింగ్‌ ఈ నెల 11 నుంచి చేపట్టనున్నట్లు సెట్‌ కన్వీనర్‌ నవీన్‌మిట్టల్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి tspolycet.nic.in వెబ్‌సైట్‌లో ప్రాసెసింగ్‌ ఫీజును ఈనెల 8 నుంచి 11లోపు చెల్లించాలని సూచించారు. 11వ తేదీన సర్టిఫికెట్ల పరిశీలన (గతంలో ధ్రువపత్రాలు పరిశీలించుకోని అభ్యర్థులు) ఉంటుందని పేర్కొన్నారు. 12వ తేదీ లోపు ఆప్షన్లు ఇవ్వాలని, 13వ తేదీన సీట్లు కేటాయిస్తామని తెలిపారు. 14, 15వ తేదీల్లో ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. సీట్లు వచ్చినప్పటికీ ఇతర కాలేజీల్లో సీట్ల కోసం వేచి చూసేవారు, ఇప్పటికీ సీట్లు రాని అభ్యర్థులు మాత్రమే ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని పేర్కొన్నారు. వివరాలకు tspolycet.nic.in వెబ్‌సైట్‌ చూడాలని సూచించారు.   

Advertisement
 
Advertisement
Advertisement