
హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న టీఎస్‌ఎడ్‌సెట్–2018 గడువును ఈనెల 25 వరకు పొడిగించినట్లు శుక్రవారం ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మధుమతి తెలిపారు. కాగా రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.