 
															24న టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నిక
ఈ నెల 24న టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయనీ తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పేర్కొన్నారు.
	హైదరాబాద్: ఈ నెల 24న టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయనీ తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పేర్కొన్నారు.  ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ  ఎన్నికల నేపథ్యంలో 20న నామినేషన్లు, 21న నామినేషన్ల పరిశీలన ఉంటుందని చెప్పారు.
	
	అలాగే కేబినెట్ నుంచి ఎవరినైనా తొలగించే హక్కు సీఎంకు ఉంటుందని  నాయిని వ్యాఖ్యానించారు.  ఆలేరు ఎన్ కౌంటర్ పై విచారణ జరిపిస్తున్నామనీ, దోషులు ఎవరైనా చర్యలు తీసుకుంటామని నాయిని నరసింహారెడ్డి చెప్పారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
