సాక్షి, నమస్తే తెలంగాణలనే ఎందుకు అడ్డుకుంటున్నారు? | TRS MP Vinodkumar takes on AndhraPradesh CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

సాక్షి, నమస్తే తెలంగాణలనే ఎందుకు అడ్డుకుంటున్నారు?

Sep 21 2014 1:55 PM | Updated on Aug 20 2018 8:20 PM

ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అవసరమని కరీంనగర్ ఎంపీ, టీఆర్ఎస్ నాయకుడు బి.వినోద్కుమార్ అన్నారు.

కరీంనగర్: ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అవసరమని కరీంనగర్ ఎంపీ, టీఆర్ఎస్ నాయకుడు బి.వినోద్కుమార్ అన్నారు. ఆదివారం కరీంనగర్లో వినోద్ కుమార్ మాట్లాడుతూ... మీడియాపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరీపై మండిపడ్డారు. పత్రికా స్వేచ్ఛ గురించి బాగా మాట్లాడే చంద్రబాబు...  నమస్తే తెలంగాణ, సాక్షి మీడియాను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏదైనా విషయం జరిగితే గోరంతను కొండంతలుగా రాసే వారు చంద్రబాబు తీరును ఎందుకు ఎండగట్టడం లేదని ప్రశ్నించారు. అక్టోబర్లో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామని వినోద్ కుమార్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement