చంద్రబాబు.. ఆ నేతలను ఎంతకు కొన్నారో? | trs mlc karne prabhakar slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు.. ఆ నేతలను ఎంతకు కొన్నారో?

Mar 4 2015 11:44 AM | Updated on Sep 4 2018 5:16 PM

చంద్రబాబు.. ఆ నేతలను ఎంతకు కొన్నారో? - Sakshi

చంద్రబాబు.. ఆ నేతలను ఎంతకు కొన్నారో?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్కు చంద్రబాబు చేసింది ఏమీలేదని ..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్కు చంద్రబాబు చేసింది ఏమీలేదని ఆయన బుధవారమిక్కడ విలేకర్ల సమావేశంలో అన్నారు. హైదరాబాద్ను గుడిసెల నగరంగా మార్చింది చంద్రబాబేనని... వ్యవసాయం దండగ అన్న బాబు... ఇప్పుడు వ్యవసాయంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఇతర పార్టీ నేతలను టీఆర్ఎస్ కొంటుందని తమపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు ...ఆంధ్రప్రదేశ్లో ఎంపీ ఎస్పీవై రెడ్డి, జూపూడి ప్రభాకర్ లాంటి నేతలను ఎంతకు కొన్నారో చెప్పాలని కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement