మహిళా సాధికారతను పట్టించుకోని ప్రభుత్వం..

trs government unsuccessful in women empowerment  - Sakshi

సమభావన సంఘాలకు పావులావడ్డీ బకాయిలు చెల్లించాలి

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హుజూర్‌నగర్‌ : మహిళా సాధికారతను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగâవారం హుజూర్‌నగర్‌ మండలం అమరవరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహిళల ఆర్థిక ప్రగతి, చైతన్యం కోసం గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఎంతగానో పాటుపడ్డాయన్నారు. ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి చేయూతనందించకుండా, రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా ప్రాతినిద్యం కల్పించలేదన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది సమభావన సంఘాల మహిళలకు పావలా వడ్డీ కింద ప్రభుత్వం రూ.రెండు వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా నేటికీ బ కాయిలు గానే మిగిలిపోయాయన్నారు. ప్రభుత్వం వెంటనే పావలా వడ్డీ బకాయిలను చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ప్రభుత్వం చెల్లించకపోతే.. 20 19లో  రానున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే బకాయిలన్నీంటినీ విడుదల చేస్తుం దన్నారు. ప్రతి సంఘానికి రూ.10లక్షలు రుణంగా అందజేసి వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. అన్ని సంఘాలకు రూ.లక్ష గ్రాంట్‌గా అందజేస్తామన్నారు. అభయహస్తం పింఛన్లను పునరుద్ధరించి ఆసరా పింఛన్లతో సంబంధం లేకుండా ప్రతినెలా రూ.1000 అందజేస్తామన్నారు. సమభావన సంఘాల సభ్యులకు ప్రస్తుతం ఉన్న బీమాను మరింతగా పెంచి సాధారణ మరణానికి రూ.2,50,000, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు అందజేస్తామన్నారు. తమ ప్రభుత్వం మహిళల సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని తెలిపారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top