ఆశ కార్యకర్తలకు గౌరవ వేతనం పెంచాలి | TRS Demand for asha workers salary hike | Sakshi
Sakshi News home page

ఆశ కార్యకర్తలకు గౌరవ వేతనం పెంచాలి

Nov 27 2014 2:16 AM | Updated on Sep 2 2017 5:10 PM

ఆశ కార్యకర్తలకు గౌరవ వేతనం పెంచాలి

ఆశ కార్యకర్తలకు గౌరవ వేతనం పెంచాలి

ఆశ కార్యకర్తలకు గౌరవ వేతనం పెంచడానికి కమిటీని నియమించాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి శ్రీపాద యశోనాయక్‌కు టీఆర్‌ఎస్ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ బుధవారం వినతి పత్రం ఇచ్చారు.

* టీఆర్‌ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌కు వెన్నెముకగా ఉన్న ఆశ కార్యకర్తలకు గౌరవ వేతనం పెంచడానికి కమిటీని నియమించాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి శ్రీపాద యశోనాయక్‌కు టీఆర్‌ఎస్ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ బుధవారం వినతి పత్రం ఇచ్చారు. గ్రామాల్లో ప్రతి వెయ్యి మందికి ఒక ఆశ కార్యకర్త వైద్య సేవల సమాచారాన్ని అందిస్తున్నారని, వారికిచ్చే ప్రతిఫలం నెలకు రూ.600 నుంచి రూ.800 మాత్రమే ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఒక్కో ఆశ కార్యకర్తకు రోజుకు రూ.26 మాత్రమే అందుతున్నాయని, దీనితో కుటుంబపోషణ అసాధ్యమని చెప్పారు. కనీసం అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇస్తున్న గౌరవ వేతనం తరహాలో ఆశ కార్యకర్తలకు ఇచ్చేందుకు సాధ్యమైన కమిటీని త్వరగా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement