ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని మృతి | Triple IT student died | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని మృతి

Dec 16 2016 2:31 AM | Updated on Nov 9 2018 4:36 PM

పదిహేను రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని శ్రీజ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధ వారం రాత్రి మరణించింది.

సిద్దిపేట రూరల్‌/బాసర: పదిహేను రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని శ్రీజ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధ వారం రాత్రి మరణించింది. సిద్ది పేటకు చెందిన రాజిరెడ్డి బాల్‌లక్ష్మిల కుమార్తె శ్రీజ(17) నిర్మల్‌ జిల్లాలోని బాసర ట్రిఫుల్‌ ఐటీలో పీయూసీ చదువుతుంది. మానసిక వేదనతో శ్రీజ ఈ నెల 1న ట్రిపుల్‌ ఐటీలోనే ఆత్మహత్యాయ త్నానికి పాల్పడింది. హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించగా, 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి చనిపోయింది. కౌన్సెలింగే కారణం.. : బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని శ్రీజను తోటి విద్యార్థుల సమక్షంలోనే కమిటీ సభ్యులు కౌన్సెలింగ్‌ నిర్వహించి మందలించారు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురై కళాశాలలోని బాత్‌ రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాగా యాజమాన్యం చర్యల కారణంగానే తమ కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని శ్రీజ నిమ్స్‌లో మృత్యువుతో పోరాడుతుండగానే ఈ నెల 7న శ్రీజ తల్లిదండ్రులు, బంధువులతో కలిసి కళాశాలలో ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపించి శ్రీజ ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement