పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న ఏఆర్ ఎస్సై గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.
కరీంనగర్: పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న ఏఆర్ ఎస్సై గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. అంబర్‌పేట్ సీపీఎల్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న యాదగిరిరావు ప్రమోషన్ పొంది ఏఆర్ ఎస్సైగా కరీంనగర్‌లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్నాడు.
ఈ క్రమంలో గురువారం ఉదయం శిక్షణలో ఉన్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన సహచరులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు యత్నించగా.. మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మృతి పట్ల పోలీసు ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు.