వినాయక నిమజ్జనంలో అపశ్రుతి | Tragedy Incident in Ganesh Immersion at KarimNagar | Sakshi
Sakshi News home page

Sep 22 2018 7:49 PM | Updated on Sep 22 2018 8:12 PM

Tragedy Incident in Ganesh Immersion at KarimNagar - Sakshi

క్రేన్‌ తాడు తెగడంతో కిందపడిపోతున్న భక్తులు

చెరువులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా క్రేన్‌ తాడు తెగిపడింది..

సాక్షి, కరీంనగర్‌ : జిల్లాలోని జమ్మికుంటలో శనివారం నిర్వహించిన గణేష్‌ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. నాయిని చెరువులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా క్రేన్‌ తాడు తెగిపడింది. ఈ ఊహించని ఘటనతో నలుగురు గాయపడ్డారు. అప్పటికే ఇదే క్రేన్‌తో రెండు విగ్రహాలను నిమజ్జనం చేయగా మూడో విగ్రహం నిమజ్జనం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విగ్రహం చిన్నది కావడంతో క్రేన్‌పైకి ముగ్గురు భక్తులను అనుమతించారు. వారితో పాటు క్రేన్‌కు సంబంధించిన ఒకరు గాయపడ్డారు. నీరు తక్కువగా ఉండటంతో వీరికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement