నల్గొండ జిల్లా కట్టంగూరులోని గద్దగోని రాములు కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. వారితో మాట్లాడి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.
నల్గొండ: నల్గొండ జిల్లా కట్టంగూరులోని గద్దగోని రాములు కుటుంబాన్ని షర్మిల బుధవారం పరామర్శించారు. వారితో మాట్లాడి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. తాము అండగా ఉంటామంటూ రాములు కుటుంబ సభ్యులకు షర్మిల భరోసా ఇచ్చారు. అయితే షర్మిల అంతకుముందు ఆలేరు మండలంలోని శారాజిపేట గ్రామంలో ఏదుళ్ల శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మోత్కూరు మండలంలోని పొడిచేడు గ్రామంలో బీపీ గౌరమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.
దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల నల్గొండ జిల్లాలో మలి విడత పరామర్శ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర బుధవారం రెండో రోజుకు చేరుకుంది.