నేడు నీటి సరఫరా బంద్‌ | Today Water Supply Bandh in Hyderabad | Sakshi
Sakshi News home page

నేడు నీటి సరఫరా బంద్‌

Mar 13 2019 11:09 AM | Updated on Mar 13 2019 11:09 AM

Today Water Supply Bandh in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఎస్‌ఆర్‌డీపీ పనులతో పాటు కృష్ణా రెండోదశ రింగ్‌మెయిన్‌–2 పైపులైన్ల లీకేజీలు, మరమ్మతు పనుల కారణంగా బుధవారం పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపి వేయనున్నట్లు జలమండలి మంగళవారం ప్రకటించింది. బుధవారం ఉదయం 11గంటల నుంచి గురువారం ఉదయం 11గంటల వరకు ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. మరమ్మతులు పూర్తయిన వెంటనే సరఫరా పునరుద్ధరిస్తామని పేర్కొంది. వైశాలినగర్, బీఎన్‌రెడ్డినగర్, ఆటోనగర్, వనస్థలిపురం, మీర్‌పేట్, బాలాపూర్, బార్కాస్, మైసారం, ఎలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, హబ్సిగూడ, నాచారం, చిల్కానగర్, తార్నాక, లాలాపేట్, బౌద్ధనగర్, మారేడ్‌పల్లి, కంట్రోల్‌రూమ్, మేకలమండి, భోలక్‌పూర్, హస్మత్‌పేట్, సికింద్రాబాద్‌ రైల్వేస్, ఎంఈఎస్, కంటోన్మెంట్‌ బోర్డు, ప్రకాశ్‌నగర్, పాటిగడ్డ తదితర ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement