జడ్చర్ల వద్ద లారీ బీభత్సం

Three Persons Fall Under Lorry And Lost Life At Jadcherla - Sakshi

జడ్చర్ల: మహబూబ్‌నగర్‌ జిల్లాలో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ఓ లారీ బీభత్సం సృష్టించింది. పనసకాయల లోడ్‌  లారీ సర్వీస్‌రోడ్‌ను ఆనుకుని ఉన్న ఓ ఇంటిని ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో రోడ్డుపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు లారీ కింద పడి దుర్మరణం చెందారు. జడ్చర్ల మండలం కావేరమ్మపేట వద్ద గురువారం ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న బంగారయ్య(23), మల్లయ్య (28)తో పాటు రఫీయొద్దీన్‌(50) అనే వ్యక్తిపై లారీ పడి  దుర్మరణం చెందారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top