టీడీపీ ఒక అబద్ధాల పాఠశాల: కర్నె | The TDP is a liar: Carney | Sakshi
Sakshi News home page

టీడీపీ ఒక అబద్ధాల పాఠశాల: కర్నె

Oct 7 2014 2:02 AM | Updated on Aug 10 2018 8:08 PM

టీడీపీ కార్యాలయం ఒక అబద్ధాల పాఠశాలని, దానికి ఏపీ సీఎం చంద్రబాబే ప్రిన్సిపాల్ అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కర్నెప్రభాకర్,

హైదరాబాద్: టీడీపీ కార్యాలయం ఒక అబద్ధాల పాఠశాలని, దానికి ఏపీ సీఎం చంద్రబాబే ప్రిన్సిపాల్  అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కర్నెప్రభాకర్, రాములునాయక్ పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే టీడీపీ తెలంగాణ నేతలు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన 54 శాతం కరెంటు వాటాను రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

తెలంగాణలో మిగులు విద్యుత్తు ఉందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు చంద్రబాబు అబద్ధాలు చెప్పాడన్నారు. న్యాయస్థానాల్లో పోరాటం ద్వారానైనా  తెలంగాణకు రావాల్సిన 54 శాతం వాటాను సాధిస్తామని  ప్రభాకర్ చెప్పారు. తమ ప్రాంతానికి నష్టం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తెలంగాణ టీడీపీ నేతలు కొందరు బాబుకు కోవర్టులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement