రికార్డు జెండా.. | the rally with 343 meters National Flag | Sakshi
Sakshi News home page

రికార్డు జెండా..

Jan 25 2016 8:30 PM | Updated on Sep 3 2017 4:18 PM

దేశ రక్షణ కోసం వీరమరణం పొందిన సైనికులకు నివాళులు ఆర్పిస్తూ వరంగల్ జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో జోహర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు 343 మీటర్ల జాతీయజెండాతో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు.

- 343 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ
- అమర సైనికులకు ఘన నివాళి
వెంకటాపురం(వరంగల్ జిల్లా)

దేశ రక్షణ కోసం వీరమరణం పొందిన సైనికులకు నివాళులు ఆర్పిస్తూ వరంగల్ జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో జోహర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు 343 మీటర్ల జాతీయజెండాతో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పోలీస్‌స్టేషన్ నుండి గ్రామంలోని చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. పఠాన్‌కోటిలో అమరులైన వీరసైనికులకు 343 మీటర్ల జాతీయ పతకాన్ని అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆనంతరం జోహర్ పాఠశాలలో పఠాన్‌కోట్ లో మరణించిన ఆరుగురు వీరసైనికుల చిత్రపటాలను ఉంచి, తాత్కాలికంగా ఏర్పాటుచేసిన అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీతో పాటు ములుగు సీఐ శ్రీనివాస్‌రావు, సీఆర్‌పీఎఫ్ ఎస్సై చరణ్‌సింగ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ జాహీద్, సర్పంచ్ మహ్మద్ రహీమొద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement