'సోదరుడే పంట నాశనం చేశాడు' | The man who destroyed the crop reported to the police | Sakshi
Sakshi News home page

'సోదరుడే పంట నాశనం చేశాడు'

Jun 14 2015 9:11 PM | Updated on Mar 28 2018 11:08 AM

పంట నాశనం చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేటలో ఆదివారం చోటుచేసుకొంది.

రంగారెడ్డి: పంట నాశనం చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేటలో ఆదివారం చోటుచేసుకొంది. వివరాలు.. మండల పరిధిలోని రావులపల్లికి చెందిన పట్లోళ్ల రంగారెడ్డి తన ఎకరా పొలంలో టమాట, పూత చిక్కుడు పంటను సాగు చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రంగారెడ్డి పెద్ద సోదరుడు శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాదులో నివాసం ఉంటున్నాడు. కాగా శుక్రవారం సాయంత్రం గ్రామానికి వచ్చిన ఆయన శనివారం తెల్లవారుజామున పొలానికి వెళ్లి తమ్ముడు సాగు చేస్తున్న కూరగాయ పంటలను నాశనం చేశాడు.ఈ విషయమై రంగారెడ్డి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పంట నాశనం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరినట్లు రంగారెడ్డి తెలిపారు.
(మోమిన్‌పేట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement