రైతు ఆత్మహత్య | The farmer commits suicide | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్య

Nov 29 2015 6:26 PM | Updated on Oct 17 2018 6:06 PM

పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం సజ్జనపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం సజ్జనపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముగురి పోచయ్య(48) అనే రైతు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పంటల పెట్టుబడి కోసం రూ. 4 లక్షల వరకు అప్పు చేశాడు. దీంతో పాటు బ్యాంకులో తీసుకున్న అప్పు కూడా పెరిగిపోవడంతో.. వాటిని తీర్చే దారి కానరాక ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా.. అప్పటికే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement