రైల్వే రవాణావిస్తరణ చేపట్టాలి | the expansion of the railway transport | Sakshi
Sakshi News home page

రైల్వే రవాణావిస్తరణ చేపట్టాలి

Nov 22 2014 3:32 AM | Updated on Sep 2 2017 4:52 PM

తెలంగాణలో రవాణా వ్యవస్థపై ఉన్న ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా రైల్వే రవాణా విస్తరణ జరగాలని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ అన్నారు.

కాజీపేట రూరల్ : తెలంగాణలో రవాణా వ్యవస్థపై ఉన్న ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయం గా రైల్వే రవాణా విస్తరణ జరగాలని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. శుక్రవారం ఆయన కాజీపేట జంక్షన్‌ను సందర్శిం చారు. రైల్వే స్టేషన్‌లోని వీఐపీ లాంజ్‌లో కాజీపేట డిజిల్ లోకోషెడ్ సీనియర్ డీఎంఈ లచ్చిరాంనాయక్, ఎలక్ట్రిక్ లోకోషెడ్ సీనియర్ డీఈఈ శివప్రసాద్‌తో సమావేశమయ్యూరు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీబీనగర్-నడికుడ మధ్య, జిల్లాలో జనగాం, పాలకుర్తి, కొడకండ్ల, సూర్యపేట మీదుగా రైల్వే లేన్‌ను ఏర్పాటు చేయాలన్నారు.

సికింద్రాబాద్-జనగాం, కాజీపేట-కొత్తగూడెం, కాజీపేట-సిర్‌పూర్ కాగజ్‌నగర్ మధ్య సిటీ ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లను ప్రవేశపెట్టాలన్నారు.  ఆయన వెంట గంట నరేందర్‌రెడ్డి, కొప్పిరాల కృష్ణ,  రైల్వే అధికారులు పి.సుధాకర్, బీఆర్.కుమార్, సజ్జన్‌లాల్, విజయరాజు, ధర్మారాజు, సుధాకర్, ఆర్‌పిఎప్ సీఐ ఇక్బాల్ అహ్మద్, జీఆర్పీ సీఐలు రాజ్‌గోపాల్, రవికుమార్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement